కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి 9 పేజీల లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ప్రాంతీయ రింగు రోడ్ (RRR), మూసీ పునరుజ్జీవనం, ప్రాంతీయ రైల్వే ప్రాజెక్ట్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులకు కేంద్రం మంజూరు చేయడం లేదని విమర్శించారు.
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు
రాష్ట్ర ప్రభుత్వం రూ. 24,269 కోట్లతో 5 మెట్రో కారిడార్ల నిర్మాణ ప్రతిపాదనలు పంపిందని సీఎం వివరించారు. 2024 జనవరి 4 న హర్దీప్ సింగ్ పురీ, అక్టోబర్ 7 న మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖలు ఇచ్చామని తెలిపారు. కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీకి లేఖ
2024 డిసెంబర్ 12 న ఢిల్లీలో కిషన్ రెడ్డి, 2025 ఫిబ్రవరి 26 న ప్రధాని నరేంద్ర మోదీ ను కలసి మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులపై లేఖ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం కలిసి మెట్రో నిర్మాణం చేపట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు
2024 జులై 22 న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, 2025 ఫిబ్రవరి 21 న రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రాముఖ్యత వివరించారని, ప్రధాని మోదీకి కూడా లేఖ పంపించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

One thought on “తెలంగాణ అభివృద్ధిపై ప్రధాన డిమాండ్లు”
Comments are closed.