బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో ప్లాస్టిక్ ఇడ్లీ (Plastic Idly) తయారీని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత విభాగం నిర్వహించిన పరీక్షల్లో 250 సాంపిల్స్‌లో 52 నమూనాల్లో ప్లాస్టిక్ షీట్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
సాధారణంగా ఇడ్లీ ని ఆవిరితో వండే సమయంలో తడి గుడ్డ (cloth) ఉపయోగించాల్సిన స్థానంలో, కొంతమంది వాణిజ్య ఉత్పత్తిదారులు ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. ప్లాస్టిక్ షీట్స్‌లో ఉన్న రసాయనాలు అధిక ఉష్ణోగ్రతల్లో కరిగిపోతూ ఆహారంలో కలుస్తాయి. ఈ మైక్రోపార్టికల్స్ క్యాన్సర్ (Cancer) వంటి ప్రాణాంతక వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు ఇడ్లీ తినేటప్పుడు అలర్ట్‌గా ఉండాలని, ప్లాస్టిక్ కవర్లలో ఆవిరిపొడవబడిన ఇడ్లీని పూర్తిగా మానుకోవాలని ఆహార భద్రత శాఖ సూచించింది. అధికారుల సూచనలను పాటిస్తూ, ఆరోగ్యకరమైన విధానాల్లో వండిన ఇడ్లీనే తినాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

One thought on “కర్ణాటకలో ప్లాస్టిక్ ఇడ్లీ నిషేధం – ఆరోగ్యానికి ముప్పుగా గుర్తింపు!”
Comments are closed.