మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఇటీవల ఆగంతకుడి చొరబాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంపీ డీకే అరుణకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరును ఆరా తీసిన సీఎం, భద్రతా వ్యవస్థలో లోపాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని సీరియస్‌గా పరిశీలించారు.
ఈ క్రమంలో డీకే అరుణ తన అనుమానాలను సీఎంకు వివరించారు. ఆకస్మికంగా తన ఇంట్లోకి ఎవరో ప్రవేశించడంతో భద్రతా వ్యవస్థలోని లోపాలు బయటపడ్డాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం, ఎంపీ డీకే అరుణకు అదనపు భద్రతను కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించారు.
ప్రముఖ రాజకీయ నేతల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని సీఎం పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసి అసలు నిజాలను తేల్చాలని, ఎవరైనా కుట్ర పన్నారా? భద్రతా వ్యవస్థలో బలహీనతలను కావాలనే ఉపయోగించుకున్నారా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
సంబంధిత అధికారులకు వెంటనే తగిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

One thought on “డీకే అరుణ ఇంట్లో ఘటనపై సీఎం రేవంత్ స్పందన – భద్రత పెంచాలని పోలీసులకు ఆదేశం”
Comments are closed.