చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభంపై సీఎం ప్రశంసలు.

జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ వంతెనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రధానికి అభినందనలు తెలిపారు.

చీనాబ్ వంతెనను ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేర్కొంటూ, ఇది భారతీయ ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో కొత్త దశ ప్రారంభమైందని కొనియాడారు. క్లిష్ట భౌగోళిక ప్రాంతంలో నిర్మించిన ఈ వంతెన భారతదేశ నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

చంద్రబాబు ట్వీట్‌లో, ‘‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా చీనాబ్ బ్రిడ్జ్ గుర్తింపు పొందింది. అలాగే, భారత్‌లోనే మొట్టమొదటి కేబుల్ స్టేయిడ్ రైల్వే వంతెనగా అంజి బ్రిడ్జ్ నిలిచింది. ఉధంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతంలో ధార్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. వందే భారత్ రైలు ద్వారా కట్రా నుంచి శ్రీనగర్ వరకు వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలను పెంచడమే కాక, దేశ గౌరవాన్ని కూడా పెంచే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

Read More : గ్రామీణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం – MINISTER

One thought on “చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభంపై సీఎం ప్రశంసలు.

Comments are closed.