వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు అయినట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేలికగా కొట్టిపారేశారు. కొడాలి నానిని కోల్‌కతాలో అరెస్టు చేశారన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం తమకు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు.
బుధవారం ఉదయం నుంచే కొడాలి నాని అరెస్టయ్యారని, ఆయన ప్రస్తుతం కోల్‌కతా పోలీసుల అదుపులో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు అనధికారిక పేజీలు, యూట్యూబ్ ఛానెళ్లు ఈ ప్రచారాన్ని మరింత విస్తృతంగా వ్యాప్తి చేశాయి. అయితే, దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు… ఇలాంటి విషయాల్లో ప్రజలు ఆమోదయోగ్యమైన సమాచారం రాబడే వరకు నమ్మకూడదని హితవు పలికారు.
ఇటీవల వైసీపీకి చెందిన కొంతమంది నేతలు వివిధ వివాదాస్పద కేసుల్లో పోలీసుల దృష్టికి రావడంతో, కొడాలి నానిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే నేపథ్యంలో కొడాలి నాని అరెస్టు వ్యవహారం చర్చకు తెరలేపింది. అయితే ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి అధికారిక అరెస్టు నమోదు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Read More : మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్

2 thoughts on “కొడాలి నాని అరెస్టు వార్తల్లో నిజం లేదు”
Comments are closed.