బీఆర్ఎస్ నాయకుడు మన్నె కృష్ణాంక్, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ పేరుతో పోలీసులు తనను అన్యాయంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేవలం 9 రోజుల్లో నాలుగోసారి విచారణకు పిలిపించారని, గతంలో మూడోసారి విచారణకు హాజరైనప్పుడు స్టేషన్‌లో పోలీసులు లేకపోయిన పరిస్థితి ఎదురయ్యిందని వెల్లడించారు.
గ్రూప్-1 పరీక్షల్లో 900 మార్కుల మధ్య కొందరు అభ్యర్థులకు కేవలం 2 మార్కులే రావడం, 654 మందికి ఒకే రకమైన మార్కులు రావడం అనుమానాస్పదంగా ఉందని, ఇలాంటి అంశాలపై విచారణ జరిపితే బాగుంటుందని సూచించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించి, బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మన్నె కృష్ణాంక్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More : హైదరాబాద్‌లో మత్తు ఇంజక్షన్లు తీసుకున్న ఇంటర్ విద్యార్థి మృతి
