పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయరా? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదాలో బిజీగా ఉన్న పవన్, సినిమాలకు ఆసక్తి తగ్గించినట్టు తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ లాంటి సినిమాలు షూటింగ్ పూర్తయ్యేలా కూడా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో పవన్ తన కుమారుడు అకీరా నందన్‌ను టాలీవుడ్‌లోకి పరిచయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో అకీరా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే అకీరా నందన్ స్టార్ మెటీరియల్ అని అభిమానులు నమ్ముతున్నారు. తాజాగా, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో అకీరా నందన్‌కు కీలక పాత్ర ఇవ్వాలని పవన్ సూచించారని, హరీష్ శంకర్ కూడా ఈ అంశంపై ఆలోచన చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అకీరా ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అవ్వొచ్చు. తండ్రి ఇమేజ్‌తో అకీరా సినిమా ప్రారంభిస్తే, అతను త్వరలోనే స్టార్ అవ్వడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
పవన్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అకీరా ఎంట్రీ ఖరారేనా? అన్న ప్రశ్నలకు త్వరలో సమాధానం రానుంది!

One thought on “పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్‌బై? అకీరా నందన్ ఎంట్రీపై ఆసక్తికర అప్‌డేట్!”
Comments are closed.