పెనుగంచిప్రోలు తిరుణాలో ఉద్రిక్తత: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హంగామా, పోలీసులపై రాళ్ల దాడి

attack

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభల ఊరేగింపులో అనుకోని ఘటన చోటుచేసుకుంది.

ప్రభల ఊరేగింపులో టీడీపీ ప్రభ సెంటర్లో ఉండగా, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వారంతట వారు వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసిరి ఉద్రిక్తత సృష్టించారు. ఈ ఘటనను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేయగా, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయి పోలీసులపైనా రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పాటు నలుగురు పోలీసు సిబ్బంది మరియు పలువురు ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Read More

One thought on “పెనుగంచిప్రోలు తిరుణాలో ఉద్రిక్తత: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హంగామా, పోలీసులపై రాళ్ల దాడి

Comments are closed.