యూట్యూబర్లపై పోలీసుల దాడి: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై 11 మందిపై కేసు నమోదు..

betting case

హైదరాబాద్: యూట్యూబ్ ద్వారా బెట్టింగ్ యాప్‌లను చట్టవిరుద్ధంగా ప్రచారం చేసి ప్రజలను ఆకర్షిస్తున్న 11 మంది యూట్యూబర్‌లపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షకులను ఆకర్షించేందుకు వివిధ రకాల ప్రమోషన్లు చేస్తూ, బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసినట్లు నిర్ధారించారు.

ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్లు హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజుల వంటి 11 మంది యూట్యూబర్లు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తమ వీడియోల్లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహిస్తూ, వీక్షకులను అకర్షించేందుకు ఆకర్షణీయమైన ప్రదర్శన చేశారు.

పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ యూట్యూబర్లు తమ ఛానల్స్‌లో ఈ యాప్స్‌కు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ వీటిని డౌన్‌లోడ్ చేసుకుని డబ్బులు పెట్టి ఆడాలని సూచించినట్లు గుర్తించారు. ఈ ప్రక్రియ ద్వారా యూట్యూబర్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, బెట్టింగ్ యాప్స్‌ వంటి అక్రమ కార్యకలాపాలకు అలవాటు పడొద్దని హెచ్చరించారు. ఇటువంటి యాప్స్‌పై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read More