ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు జపాన్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసింది. పరస్పర సహాయ సహకారాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “ఈరోజు అమరావతిలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాం. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో జపాన్ పెట్టుబడులను విస్తరించడంపై చర్చించాం. రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలను అందించేందుకు నౌకానిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమలు, ఆటోమొబైల్స్, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని పరిశీలించాం” అని వెల్లడించారు.
ఈ భేటీ ద్వారా జపాన్‌తో వ్యాపార సంబంధాలు మరింత గట్టి పునాది వేయనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read More : పిఠాపురంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు

One thought on “అమరావతిలో జపాన్ రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ”
Comments are closed.