ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గమైన పిఠాపురంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (Road Over Bridge) నిర్మాణానికి ప్రభుత్వం రూ. 59.70 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పాలనాపరమైన అనుమతులు లభించాయని అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడం సంతృప్తిని కలిగిస్తోందన్నారు. ఉప్పాడ-సామర్లకోట రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ వంతెన పూర్తయితే వాహన రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ‘సేతు బంధన్’ (Setu Bandhan) పథకం కింద చేపట్టినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More : తూర్పుగోదావరి జిల్లాలో మహిళకు బ్లాక్‌మెయిల్ వేధింపులు – ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

One thought on “పిఠాపురంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు”
Comments are closed.