బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలంకకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ అమ్మడు, ఇటీవల మరోమారు వార్తల్లో నిలిచింది.
జాక్వెలిన్ ఇటీవల ముంబైలో తన తల్లి కిమ్ ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో ఉన్నారు. కిమ్ ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని సమాచారం. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
జాక్వెలిన్ తన తల్లి ఆరోగ్యం కారణంగా ఐపీఎల్ ధనా ధన్ టోర్నీని తిరస్కరించింది. కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్‌కు ముందు జరిగే ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇవ్వమని చెప్పినప్పటికీ, జాక్వెలిన్ తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అది రద్దు చేసింది.
జాక్వెలిన్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సోషల్ మీడియాలో ఆమెను ప్రశంసిస్తున్నారు. నెటిజన్లు ఆమెకు మరిన్ని శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

One thought on “ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ను వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్ జాక్వెలిన్”
Comments are closed.