తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. ఇకపై తిరుమల కొండపై భక్తులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని టీటీడీ ప్రకటించింది.
ఈ విషయాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. “తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) బస్సుల ద్వారా ఉచిత సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాం” అని ఆయన తెలిపారు.
తిరుమల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు వివిధ ఆలయాలు, దర్శన క్యూలైన్లు, బస చేసే ప్రాంతాల మధ్య సులువుగా రాకపోకలు సాగించేందుకు ఈ ఉచిత బస్సు సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సౌకర్యం భక్తులకు ఆర్థికంగా కొంత భారాన్ని తగ్గించడమే కాకుండా, తిరుమలలో వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
Read More : CM : భారీగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం
Our YouTube Channel Click Here

2 thoughts on “తిరుమలలో ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం”
Comments are closed.