బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం: భారీ వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది, కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయని తెలియజేసింది.