ఆంధ్రప్రదేశ్‌కు పర్యావరణ రంగంలో గర్వకారణమైన గౌరవం

భారత ప్రభుత్వం విడుదల చేసిన తాజా 2025 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి ఆకట్టుకుంది. వనరక్షణ, జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) మరియు వాతావరణంలో మెరుగుదల వంటి కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానాన్ని సాధించింది. ప్రకృతి పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తోందని ఈ ర్యాంకింగ్స్‌ ద్వారా స్పష్టమైంది.

ఈ విభాగాల్లో కర్ణాటక, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వనసంపదను కాపాడడంలో, పర్యావరణ అనుకూల విధానాల అమలులో ఆంధ్రప్రదేశ్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ర్యాంకింగ్ ప్రకటనతో రాష్ట్రం పర్యావరణ పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Read More : తిరుమలలో ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం

One thought on “ఆంధ్రప్రదేశ్‌కు పర్యావరణ రంగంలో గర్వకారణమైన గౌరవం

Comments are closed.