వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నుంచి రెండు రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరిన జగన్, సాయంత్రం 5.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఈ రాత్రి పులివెందులలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 6.45 గంటలకు జగన్ స్వగృహం నుంచి వాహనంలో బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కి చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ఉదయం 8.45 గంటలకు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజలతో భేటీ అయ్యి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం పులివెందుల నుంచి 3.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు తిరిగి బెంగళూరుకు చేరుకోనున్నారు.
Read More : విద్యా రంగ అభివృద్ధిపై మంత్రి లోకేష్ దృష్టి

One thought on “వైఎస్ఆర్ ఘాట్‌కు జగన్ పర్యటన”
Comments are closed.