భర్త త్యాగాన్ని మరిచి, అక్రమ సంబంధం

బీహార్‌లోని వైశాలి జిల్లాలో అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తన భర్త చేసిన త్యాగాన్ని మరిచి అక్రమ సంబంధం పెట్టుకుంది. తన తల్లి నగలు అమ్మి భార్యను చదివించిన భర్తకు తీరని ద్రోహం చేసింది. తాజాగా, భర్త తన ఇంట్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, సదరు మహిళకు ఉద్యోగం రాకముందు ఆమె భర్త, తన తల్లి బంగారు నగలు అమ్మి మరీ చదువుకు అండగా నిలిచాడు. భార్యకు అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత వారి జీవితం సంతోషంగా సాగుతుందని ఆశించాడు. అయితే, ఉద్యోగం వచ్చిన కొద్ది కాలానికే భార్య తన విభాగానికే చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

రోజువారీ విధులు ముగించుకొని ఇంటికి తిరిగివచ్చిన భర్తకు షాక్ తగిలింది. తన భర్త వస్తున్నాడని తెలుసుకున్న మహిళ, తన ప్రేమికుడిని మంచం కింద దాచిపెట్టి, తాను మాత్రం హడావిడిగా యూనిఫాం వేసుకుంది. అయితే, భర్తకు అనుమానం వచ్చి మంచం కింద చూడగా ఆమె ప్రేమికుడు కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read more : సోనియా గాంధీ : ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన

Our YouTube Channel Click Here