తెలుగు ఫిలింఛాంబర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్ ఆవరణలో పైడి జయరాజ్ ఫొటోను చిన్నగా ఉంచారని, సి. నారాయణరెడ్డి ఫొటోను ఎందుకు పెట్టలేదని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం పెద్దదిగా మారడంతో ‘ఆంధ్రా గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
నిర్మాతల మండలి ఛాంబర్‌లోకి చొరబాటుకు ప్రయత్నించడంతో వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఫిలింఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్‌తో పాశం యాదగిరి ఘర్షణకు దిగారు. ఈ పరిణామంతో పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత అదుపులోకి వచ్చింది.
ఫిలింఛాంబర్ ప్రాంగణంలో ఇలాంటి సంఘటనలు జరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read More : డేవిడ్ వార్నర్‌కు రాజమౌళి బాహుబలి కిరీటం గిఫ్ట్

2 thoughts on “తెలుగు ఫిలింఛాంబర్‌లో ఉద్రిక్తత”
Comments are closed.