జగిత్యాల జిల్లాలో ఒక సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలను వదిలేసి ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం చేస్తున్న విషయం బయటపడటంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే, జగిత్యాల పట్టణానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి తన భార్య లాస్య, పిల్లలను వదిలి ట్రాన్స్‌జెండర్ దీపుతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తట్టుకోలేక లాస్య ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఆందోళన చెందిన అత్తమామలు రాజశేఖర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, అతడు ఆసుపత్రికి రాకపోవడంతో అనుమానం కలిగింది.
తరువాత ఇంటి వద్ద వెతికిన అత్తమామలు తలుపులు తాళం వేసి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా రాజశేఖర్ ట్రాన్స్‌జెండర్ దీపుతో ఉండటం గుర్తించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
Read More : తెలుగు ఫిలింఛాంబర్లో ఉద్రిక్తత

One thought on “భార్యను వదిలి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం ?”
Comments are closed.