BRS -BJP గుట్టును బయటపెట్టిన మహేశ్ కుమార్ గౌడ్..

తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రక్షించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోందని విమర్శించారు.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు మంత్రి కేటీఆర్ పూర్తి ప్రయత్నం చేస్తున్నారని గౌడ్ ఆరోపించారు. కవితను కేసుల నుంచి కాపాడేందుకు కేటీఆర్ బీజేపీకి కట్టుబడి పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

సంఖ్యాబలం లేని బీజేపీ, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి సహాయం చేస్తోందని విమర్శించారు.

బీఆర్ఎస్ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ, రాజకీయ లబ్దికోసం ఈ గేమ్ ఆడుతోందని గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మేలు జరిగే పనికంటే, నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, నిధులు నిలిపివేసినప్పుడు బీజేపీని ఎదుర్కొనలేక మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కి అడ్డుపడిన బీఆర్ఎస్, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పదేళ్లు మద్దతుగా నిలిచిందని విమర్శించిన గౌడ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నేతలు విమర్శించడం అజ్ఞానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

One thought on “BRS -BJP గుట్టును బయటపెట్టిన మహేశ్ కుమార్ గౌడ్..

Comments are closed.