హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియా మరోసారి దొరికింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఈగల్ టీమ్ బద్దలుగొట్టింది. ఈ దందాకు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వం వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అతడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖ కార్డియాలజిస్టుకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ ఇచ్చినట్లు కూడా ఈగల్ టీమ్ వివరించింది.
ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశముందని పోలీసులు తెలిపారు.
Read More : సిగాచి పేలుడు ప్రమాదం: 44కి చేరిన మృతుల సంఖ్య

One thought on “హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా బుగ్గిపడింది”
Comments are closed.