తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికారిక నివాసంలో జరిగింది. ఇరువురు నేతల మధ్య సుమారు గంటకు పైగా సమాలోచనలు సాగినట్లు సమాచారం.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ అవకాశాలు, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లో వివిధ కమిటీల నియామకం వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మీనాక్షి నటరాజన్ గత పది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ విస్తృతంగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశం తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక మార్పులు రావొచ్చన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read More : తెలంగాణలో ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు.

One thought on “తెలంగాణ సీఎం : రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చలు.”
Comments are closed.