బెంగళూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, అసోసియేషన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ KSCA హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, బాధ్యత తమపై నేరుగా మోపడం సబబుకాదని ఈ పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం.
దుర్ఘటన జరిగిన రోజు స్టేడియంలో ఏర్పాట్లలో లోపాలున్నాయనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయపరంగా కొనసాగుతోంది.
ఇప్పటివరకు ఈ ఘటనపై KSCA అధికారికంగా పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ హైకోర్టులో వేసిన పిటిషన్ నేపథ్యంలో త్వరలో వారి వైఖరిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
read More : ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే అరెస్ట్

One thought on “హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్”
Comments are closed.