పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు భద్రాచలంకు వెళ్లనున్నారు. రేపు భద్రాచలం శ్రీరాముని కళ్యాణోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుండగా, ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పవన్ పాల్గొననున్నారు.

భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున పవన్ ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలంకు బయలుదేరి, సాయంత్రం 5 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఈ రాత్రి భద్రాచలంలోనే ఆయన బస చేస్తారు.

రేపు పవన్ కళ్యాణోత్సవాల్లో పాల్గొని, స్వామివారికి తలంబ్రాలను సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించి, రాత్రి 10 గంటలకి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.

ఇక ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు.

Read More : నారా లోకేష్ వ్యాఖ్యలు: ప్రతి విషయంలో చంద్రబాబుతో పోటీ పడ్డానని స్పష్టం

One thought on “పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన

Comments are closed.