ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలు సినిమా చేసే సమయంలో హీరో మార్కెట్, ఇమేజ్, గత హిట్స్‌ను బేస్‌గా తీసుకుంటున్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ ఫార్ములా అందరినీ దాటి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. బాహుబలి తర్వాత ఆయన పలు చిత్రాల్లో నటించారు. వాటికి ఫలితాలు మిశ్రమంగానే వచ్చినా, నిర్మాతల నమ్మకం మాత్రం ఆయనపై ఏ మాత్రం తగ్గలేదు. అతనితో సినిమా అంటే నాన్-స్టాప్ బజ్, భారీ బడ్జెట్, పాన్ ఇండియా రేంజ్ అనే నమ్మకంతో ముందుకు వస్తున్నారు నిర్మాతలు.
ఈ మధ్యకాలంలో ప్రభాస్ సినిమాలకు ఖర్చవుతున్న బడ్జెట్లు చూస్తే ఆశ్చర్యం కలగాల్సిందే. రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, కల్కి 2898 ఏడి వంటి సినిమాలేవీ చిన్న ప్రాజెక్టులు కావు. ఒక్కో సినిమాకు రూ.300 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయడం ద్వారా ఆయన మార్కెట్ పవర్‌ను నిరూపించుకుంటున్నారు. లేటెస్ట్‌గా మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ ఎంటర్‌టైనర్ ‘రాజాసాబ్’ కోసం రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయించడమే దీనికి నిదర్శనం. ఇది కేవలం ఓపెనింగ్స్ వల్ల కాదు, ఆయన మీద ప్రేక్షకులలో ఉన్న ఫెయిత్, విదేశాల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కూడా కారణమే.
ఓ స్టార్ డైరెక్టర్ లేకపోయినా కేవలం ప్రభాస్ పేరుతోనే నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ పెట్టడంలో వెనుకాడటం లేదు. ఇది ఇండస్ట్రీలో చాలా అరుదైన విషయం. ప్రభాస్ సినిమాలకు కంటెంట్ బలహీనంగా ఉన్నా, ఓపెనింగ్స్ మాత్రం భారీ స్థాయిలో ఉంటాయి. ఇది నిర్మాతలకు కనీస భద్రతగా మారుతోంది. ప్రస్తుతం రూపొందుతున్న ‘కల్కి 2898 AD 2’, ‘రాజాసాబ్’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’ వంటి సినిమాలు ప్రభాస్ మార్కెట్‌ను మరోసారి నిరూపించే అవకాశముందని అంచనాలు నెలకొన్నాయి.

One thought on “బడ్జెట్‌కు గ్యారంటీ.. రిస్క్‌ఫ్రీ హీరోగా రెబల్ స్టార్ రేంజ్!”
Comments are closed.