గ్రామీణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం – MINISTER

nara lokesh

ఆంధ్రప్రదేశ్‌ పేదల కోసం కొనసాగుతున్న ఆర్డీటీ సేవలు ఆగబోవని, వాటి కొనసాగింపుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పేదల అభివృద్ధికి Rural Development Trust (ఆర్డీటీ) సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహా సంబంధిత సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

లోకేష్ వివరించడంతో… తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3,500 గ్రామాల్లో ఆర్డీటీ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలనేకాకుండా తెలంగాణలో మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్య, వైద్య, ఉపాధి వికాస రంగాల్లో ఆర్డీటీ ప్రాధాన్యతగా పని చేస్తోందని వివరించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో బత్తలపల్లి, అనంతపురంలో కళ్యాణదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో 600 పడకలతో మూడు పెద్ద ఆసుపత్రులు ఆర్డీటీ నడుపుతుండగా, ఏడాదికి 8.5 లక్షల అవుట్‌పేషెంట్లు, 60 వేలకుపైగా ఇన్‌పేషెంట్లు సేవలు పొందుతున్నారని వెల్లడించారు. కరోనా సమయంలో బత్తలపల్లి ఆసుపత్రిని కోవిడ్‌ కేంద్రంగా మార్చి దాదాపు 10 వేల మందికి చికిత్స అందించారని గుర్తు చేశారు.

అలాగే, అనంతపురం జిల్లాలో ముగులు, చెవిటి, మానసిక వికలాంగుల విద్యార్థుల కోసం ఆర్డీటీ ఆధ్వర్యంలో మూడు ప్రాథమిక పాఠశాలలు, రెండు ఉన్నత పాఠశాలలు నడుపుతున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు ప్రభుత్వ స్థాయిలో అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Read More : ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

One thought on “గ్రామీణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం – MINISTER

Comments are closed.