స్టాక్ మార్కెట్లు: మిశ్రమంగా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 స్టాక్స్ తెలుసా?
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా కొనసాగుతున్నాయి. నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టాప్ 5 స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లు: మిశ్రమంగా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 స్టాక్స్ తెలుసా?
స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (డిసెంబర్ 6) మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలతోపాటు పలు అంశాల వల్ల మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు BSE సెన్సెక్స్ 30 పాయింట్లు పెరిగి 81,796 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 12 పాయింట్లు తగ్గి 24,700 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయింది, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 30 పాయింట్లు లాభపడింది. ఈ కారణంగా పలువురు మదుపర్లు లాభపడ్డారు, మరికొంత మంది మాత్రం నష్టపోయారు.
టాప్ 5 స్టాక్స్
ఇప్పటికే TCS, విప్రో, లార్సెన్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. కాగా, బజాజ్ ఆటో, ట్రెంట్, ఐషర్ మోటార్స్, ITC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. నేడు సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ రివ్యూ కమిటీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్నారు. మార్కెట్ ఈ రోజు నిర్ణయంపై హెచ్చుతగ్గులకు లోనుకానుంది. ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి గణాంకాలు ఆందోళనకరంగా ఉండడంతో ఈసారి వడ్డీ రేట్లలో కోత ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వీటిపై చర్యలు
సంబంధిత పార్టీలతో సందేహాస్పద లావాదేవీల ద్వారా కంపెనీ దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ మిష్టన్ ఫుడ్స్‌ను సెబీ ఆదేశించింది. దాదాపు ₹100 కోట్లను తిరిగి ఇవ్వాలని మిష్టన్ ఫుడ్స్‌ను కోరింది. అదనంగా, మిష్టన్ ఫుడ్స్ ప్రమోటర్, CMD హితేష్‌కుమార్ గౌరీశంకర్ పటేల్‌తో సహా ఐదు సంస్థలపై సెబీ నిషేధం విధించింది. వీరు తదుపరి నోటీసు వచ్చే వరకు సెక్యూరిటీ మార్కెట్‌లను యాక్సెస్ చేయలేరు.
చైనా, వియత్నాం నుంచి టెక్స్‌చర్డ్ టెంపర్డ్ కోటెడ్, అన్‌కోటెడ్ గ్లాస్ దిగుమతులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక యాంటీ డంపింగ్ డ్యూటీని అమలు చేసింది. డిసెంబర్ 4 నుంచి ఆరు నెలల పాటు ఈ డ్యూటీ అమల్లో ఉంటుంది.
కెనరా రోబెకో AMCలో 13% వాటాను విక్రయించడానికి IPO ద్వారా కెనరా రోబెకో AMC, కెనరా HSBC లైఫ్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు RBI నుంచి ఆమోదం లభించింది.
అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లలో రికార్డు స్థాయిలో ర్యాలీ కనిపించినప్పటికీ, ఆపై ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిన్న నాస్‌డాక్, S&P స్వల్ప క్షీణతతో ముగిశాయి. లాభాల బుకింగ్ కారణంగా డౌ 250 పాయింట్లు పడిపోయింది. ఈ ఉదయం GIFT నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 24,800 పైన కనిపించింది.
ఈ రోజు అమెరికాలో నవంబర్ ఎంప్లాయిమెంట్ డేటా ముందు డౌ ఫ్యూచర్స్ 50 పాయింట్లు, నిక్కీ 250 పాయింట్లు పడిపోయాయి. ఎఫ్‌ఐఐల భారీ కొనుగోళ్లు ₹17,777 కోట్లకు చేరాయి.
ఇవి కూడా చదవండి:
- Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి ₹100 పెట్టుబడి, ఇప్పుడు ₹1.7 కోట్లు
- Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి
- Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే
- Personal Finance: నెలకు ₹5 వేలు సేవ్ చేస్తే.. ₹2 కోట్లు కోసం ఎన్నేళ్లు కట్టాలి.
