వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డికి అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. మద్యం విధానంలో అవకతవకల కేసులో ఆయనపై చర్యలకు ఏపీ సీఐడీ వేగం పెంచింది. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి.
ఇటీవల ఏపీ హైకోర్టులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. కేసు ఇంకా తొలిదశ దర్యాప్తులోనే ఉందని, మిథున్‌రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని అప్పట్లో హైకోర్టుకు తెలిపిన సీఐడీ, ఇప్పుడు మాత్రం ఆయన్ను అరెస్టు చేసేందుకు చర్యలు ప్రారంభించడంపై చర్చ జరుగుతోంది.
బెయిల్ తిరస్కరణ అనంతరం వెంటనే సీఐడీ బృందాలు ఢిల్లీకి వెళ్లడం ఈ వ్యవహారానికి నూతన మలుపు తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా, మిథున్‌రెడ్డి ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
Read More : పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన

One thought on “వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం..”
Comments are closed.