మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కఠినంగా స్పందించారు. ‘వై నాట్ 175’ అంటూ గర్వపడ్డ జగన్, 11 సీట్లకు పరిమితమవడంతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో జర్మనీ చట్టాలు అమలు చేయడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. వైసీపీకి తాడు బొంగరం లేని పార్టీగా అభివర్ణించారు. ఇంగితజ్ఞానం లేకపోవడంతోనే జగన్ తనను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ వేలాది మందికి ఆర్థిక సాయం అందించారని, కానీ జగన్ ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా దానం చేశారా? అని నిలదీశారు. పట్టభద్రుల ఎన్నికల్లో యువత స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ‘సూపర్ 6’ గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా ఒక్కరోజైనా పనిచేశారా? అంటూ నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ‘వర్క్ ఫ్రం హోమ్’ సీఎం అయిన జగన్, ఇప్పుడు ‘వర్క్ ఫ్రం బెంగళూరు’ ఎమ్మెల్యేగా మారారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

One thought on “నాదెండ్ల మనోహర్: జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్”
Comments are closed.