చంద్రబాబు ఢిల్లీ పర్యటన: అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో కీలక చర్చలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు.

అమిత్ షాకు అరకు కాఫీ, ప్రత్యేక జ్ఞాపికను అందజేసిన చంద్రబాబు, దాదాపు గంట పాటు వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతులను నిర్మలా సీతారామన్‌కు అందజేసిన చంద్రబాబు, రాష్ట్రానికి కేంద్ర సహకారం కోరినట్లు సమాచారం.

Read More

One thought on “చంద్రబాబు ఢిల్లీ పర్యటన: అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో కీలక చర్చలు

Comments are closed.