ఏప్రిల్ 14లోపు హాజరుకావాలని ఆదేశం

Rahul Gandhi

రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు నుంచి చుక్కెదురైంది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో హాజరుకాకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. దీంతో రాహుల్ గాంధీపై రూ. 200 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 14న కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టంచేసింది.

2002 మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బ్రిటీష్ వారికి సావర్కర్ పనిమనిషి అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. చరిత్రను వక్రీకరించారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నృపేంద్ర పాండే అనే లాయర్ ఫిర్యాదు మేరకు లక్నో కోర్టులో కేసు నమోదైంది. సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు సమన్లు జారీ చేసిన కోర్టు, తాజాగా రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14న కూడా హాజరుకాకపోతే కఠిన చర్యలు తప్పవని న్యాయమూర్తి హెచ్చరించారు.

Read More