కొడాలి నానికి హైకోర్టులో ఊరట

kodali nani

ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖపట్నంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ క్రమంలో 35(3) కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించింది.

గత ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నానిపై కేసు నమోదైంది. అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులతో కొడాలి నానికి తాత్కాలిక ఊరట లభించింది.

Read More

One thought on “కొడాలి నానికి హైకోర్టులో ఊరట

Comments are closed.