రామానాయుడు : వైసీపీ పాలన వల్లే రాష్ట్రానికి గరిష్ఠ నష్టం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ పాలనలో చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ… తిరిగి పాలనను సరైన దారిలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ నుంచి ఐసీయూకి తీసుకొచ్చాం. 2047 నాటికి తెలుగు జాతిని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం” అని తెలిపారు.

జగన్‌పై తీవ్రమైన విమర్శలు

విపక్ష హోదా లేని వ్యక్తిగా జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డ నిమ్మల రామానాయుడు, పోలవరం ప్రాజెక్టును 41.5 మీటర్ల నుంచి 45.72 మీటర్ల ఎత్తుపై రాజకీయం చేస్తూ, ఆ ప్రాజెక్టు విధ్వంసానికి జగన్ే కారణమని ఆరోపించారు. ఈ ఏడాది పోలవరంలో లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ ద్వారా నీటిని విడుదల చేయాలని యత్నిస్తున్నట్టు చెప్పారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్, 2027 డిసెంబర్ నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

బనకచర్ల ప్రాజెక్టు – జలాల వినియోగంపై దృష్టి

గోదావరిలో ప్రతీ ఏడాది 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందని పేర్కొన్న రామానాయుడు, ఆ నీటిని వరద కాలంలో 200 టీఎంసీలుగా నిల్వ చేసి రాయలసీమకు తరలించాలని సంకల్పించారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల ద్వారా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామిగా తీసుకుంటామని వెల్లడించారు.

ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. “హంద్రీనీవా ప్రాజెక్టుపై జగన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుంటాం. వంశధార, తోటపల్లి ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తిచేయాలన్నదే మా లక్ష్యం” అని చెప్పారు.

Read More : రాయలసీమకు నీటి ఆశ – నిమ్మల రామానాయుడు స్పష్టం

One thought on “రామానాయుడు : వైసీపీ పాలన వల్లే రాష్ట్రానికి గరిష్ఠ నష్టం

Comments are closed.