అమరావతి మహిళల పోరాటాన్ని ప్రశంసించిన చంద్రబాబు – జగన్‌పై తీవ్ర విమర్శలు

jagan

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ఈ సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన మండిపడ్డారు.

మహిళా సాధికారితపై చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి మహిళల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తూనే ఉందన్నారు. 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించామని గుర్తుచేశారు.

అమరావతి రాజధాని కోసం తమ భూములను వాలంటరీగా సమర్పించిన రైతులు, అమరావతి మహిళలు చేసిన పోరాటాన్ని చంద్రబాబు ప్రశంసించారు. అమరావతి మహిళలు ఐదేళ్ల పాటు వీరోచితంగా పోరాడారని తెలిపారు.

జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ, మూడు రాజధానుల ఆలోచనతో రైతులను మోసం చేశారని విమర్శించారు. అమరావతిని బ్రతికించిందంటే, అది మహిళల పోరాటమే కారణమని అన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతులను హింసించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతి చరిత్రలో మహిళల త్యాగం చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Read More

One thought on “అమరావతి మహిళల పోరాటాన్ని ప్రశంసించిన చంద్రబాబు – జగన్‌పై తీవ్ర విమర్శలు

Comments are closed.