ఓటీటీలోకి ముఫాసా: తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్!

Mufasa

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ త్వరలోనే తెలుగు ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ‘ది లయన్ కింగ్’ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

ఈ చిత్రాన్ని జియో హాట్‌స్టార్ లో మార్చి 26, 2025 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇది 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది.

ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. కానీ, తెలుగు వర్షన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మార్చి 26న నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇంట్లోనే వీక్షించొచ్చు.

Read More

One thought on “ఓటీటీలోకి ముఫాసా: తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్!

Comments are closed.