ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్త న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు ప్రాంగణంలో ఆయనతో ప్రమాణం చేయించారు.
జస్టిస్ దేవానంద్ హైకోర్టులో నాలుగవ స్థానంలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13 వరకు కొనసాగుతుంది. దీంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి పెరిగింది.
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన జస్టిస్ బట్టు దేవానంద్ 1966లో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ, లా కాలేజీ నుంచి న్యాయవాద పట్టా పొందారు. విద్యార్థి దశలోనే సంఘం నాయకత్వం వహించారు. 2006లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు.
Read More : వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం ఢిల్లీ కంటే పెద్దది – Minister

2 thoughts on “ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్”
Comments are closed.