తెలుగువారంతా రాష్ట్ర రక్షణకు ముందుకొచ్చారు – మంత్రి

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింగపూర్ అభివృద్ధి తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

“గత ఐదేళ్ల విధ్వంస పాలనను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ముందుకు వచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి విదేశాల్లోని తెలుగువారు ఐక్యంగా పనిచేస్తున్నారు. ఏ దేశానికైనా వెళ్ళినా, సీఎం చంద్రబాబు, నేను తొలుత అక్కడి తెలుగువారినే కలవాలని నిర్ణయించుకున్నాం” అని లోకేశ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని లోకేశ్ అన్నారు. అలాగే, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటనకు రానున్నారని వెల్లడించారు.

Read More : ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్