నలుగురితో భర్త హత్యకు యత్నించిన భార్య

హైదరాబాద్‌లో భార్యే భర్త హత్యకు యత్నించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే, రాందాస్ అనే వ్యక్తిని హత్య చేయాలని అతని భార్య జ్యోతి నలుగురు యువకులతో కలిసి పథకం వేసింది. భర్తను బౌరంపేటకు తీసుకెళ్లి మద్యం తాగించి, బీరు బాటిళ్లతో దారుణంగా దాడి చేశారు. రాందాస్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడని భావించి యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తీవ్ర గాయాలతో ఉన్న రాందాస్ తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిన విషయాలను వివరించడంతో ఈ ఘటన బయటపడింది. అనంతరం బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో రాందాస్ భార్య జ్యోతి, దాడిలో పాల్గొన్న నలుగురు యువకులపై ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More : ఇన్‌స్టాగ్రామ్ యువకుడి కోసం బిడ్డను వదిలిన తల్లి

One thought on “నలుగురితో భర్త హత్యకు యత్నించిన భార్య

Comments are closed.