ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్ పరీక్షల్లో 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విజయాలు సాధించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని అభినందించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థులను సీఎం హృదయపూర్వకంగా అభినందించారు. పేదరికం అడ్డంకిగా మారకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం ఎంతో గొప్ప విషయం అని ప్రశంసించారు. వారి భవిష్యత్తు మరింత వెలుగొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తమ విజయానికి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గురుకుల పాఠశాలల్లో లభించిన నాణ్యమైన విద్య ప్రధాన కారణమని విద్యార్థులు పేర్కొన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More : రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో ఊరట

One thought on “గురుకుల విద్యార్థుల జాతీయ విజయాలు – సీఎం”
Comments are closed.