చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ విచారణ వాయిదా

ఏపీలో మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి తక్షణ ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన మధ్యంతర మరియు రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‌పై విచారణను రేపటికి, రెగ్యులర్ బెయిల్‌పై సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ కుంభకోణం కేసును లోతుగా పరిశీలించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కసిరెడ్డి తదితరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. ప్రస్తుతం వారు బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి.

Read More : గురుకుల విద్యార్థుల జాతీయ విజయాలు – సీఎం

One thought on “చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ విచారణ వాయిదా

Comments are closed.