ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టు నుండి ఊరట లభించింది. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా కొన్నేళ్ల క్రితం ఆయనపై, ఆయన కార్యాలయ సిబ్బందిపై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. అయితే, ఆ కేసును ఇకపై కొనసాగించదలచుకోవడం లేదంటూ ఫరూక్ బాషా ఇటీవల సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జెకే మహేశ్వరి ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. దీంతో రఘురామపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టంచేసింది. ఈ తీర్పుతో రఘురామ కృష్ణంరాజుకు పెద్ద ఊరట కలిగింది.
Read More : చట్టసభల సమావేశాలు ఏడాదికి కనీసం 60 రోజులు జరగాలి: ఉపసభాపతి

2 thoughts on “రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో ఊరట”
Comments are closed.