నల్గొండలో మంత్రి క్యాంపు వద్ద ఆత్మహత్యాయత్నం

నల్గొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే సమయస్ఫూర్తితో స్పందించిన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని మున్సిపల్ మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరుణాకర్‌గా పోలీసులు గుర్తించారు. మంత్రి అనుచరుల ఒత్తిడితో తాను అన్యాయంగా ఉద్యోగం కోల్పోయినట్లు ఆయన ఆరోపించారు. ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, పరిస్థితులు దిగజారడంతోనే ఈ తడిగమిరిన నిర్ణయం తీసుకున్నట్లు కరుణాకర్ వేదన వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మంత్రి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read More : రాజాసింగ్ రాజీనామా ఆమోదంపై స్పందించిన బీజేపీ నేత లక్ష్మణ్