దీపం-2 పథకం (Deepam-2 Scheme)లో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) పొందేందుకు లబ్ధిదారులకు మార్చి 31 వరకు గడువు ఉందని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) తెలిపారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఆయన వివరించారు.
గ్యాస్ డెలివరీ & రీఫండ్ ప్రక్రియ
మంత్రివర్యుల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటలలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయనున్నారు. డెలివరీ అయిన 48 గంటలలోపు లబ్ధిదారుల ఖాతాల్లో చెల్లించిన మొత్తం తిరిగి జమ అవుతుందని తెలిపారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయని, ఒక్కో సిలిండర్‌ను నాలుగు నెలల గ్యాప్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
ఉచిత గ్యాస్ బుకింగ్ & ఫిర్యాదుల నమోదు
ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్య ఒక సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైనట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1967కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
ఎలా పొందవచ్చంటే?
రేషన్‌కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హత ఉంది. అయితే గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉండాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌లో లేకపోతే వెంటనే పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని లబ్ధిదారులు మార్చి 31లోపు బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Read More : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు – టూరిజం అభివృద్ధిపై దృష్టి
