‘ఛావా’ సినిమాపై నటి సంచలన ట్వీట్ – నాగ్‌పూర్ అల్లర్లకు కారణమా?

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా, నాగ్‌పూర్ అల్లర్లకు ‘ఛావా’ సినిమానే కారణమంటూ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అయితే, సినిమాకు సంబంధించి స్వరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

స్వరా తన ట్వీట్‌లో ‘ఛావా సినిమా రెచ్చగొట్టేలా ఉంది, నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు దర్శక నిర్మాతలే బాధ్యులు, సినిమాను నిషేధించాలి’ అంటూ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ట్వీట్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కామెడీ షోకు మద్దతు తెలిపారని తెలుస్తోంది. దీంతో నటి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే స్వరా భాస్కర్ మాత్రం ఆ ట్వీట్లు తాను చేయలేదని, అవి ఫేక్ అంటూ వివరణ ఇచ్చారు.

స్వరా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో “ఇవన్నీ అర్థహీనమైన పనులు ఫోటోలు, మీమ్స్ వైరల్ చేయడం… దయచేసి నిజాలు తెలుసుకోండి’’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

గతంలో కూడా ఛావా సినిమాపై ఆమె ఓ పోస్ట్ పెట్టగా, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, స్వరా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివాజీ మహారాజ్ పరిపాలనపై గౌరవం ఉందని స్పష్టంచేశారు. నా మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Read More

One thought on “‘ఛావా’ సినిమాపై నటి సంచలన ట్వీట్ – నాగ్‌పూర్ అల్లర్లకు కారణమా?

Comments are closed.