సినిమా తారల జీవితం ఎంతో విలాసవంతమైనదని భావించే వారు చాలా మంది ఉన్నారు. అయితే వెండితెర వెనుక వారికి ఎదురయ్యే సమస్యలు, అనారోగ్య కష్టాలు మనకు తెలియవు. తమ కెరీర్‌పై ప్రభావం పడుతుందనే భయంతో చాలామంది సెలబ్రిటీలు తమ ఆరోగ్య సమస్యలను బయటపెట్టేందుకు కూడా సంకోచిస్తారు.
కానీ కొందరు ధైర్యంగా తమ అనుభవాలను పంచుకుంటూ, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. తాజాగా, నటి సుహాసిని కూడా తాను అనుభవించిన అనారోగ్య సమస్య గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సుహాసిని మాట్లాడుతూ, “నాకు టీబీ సమస్య ఉంది. కానీ భయంతో ఆ విషయాన్ని చాలా కాలం దాచిపెట్టాను. పరువు పోతుందేమో అనే భయం కూడా ఉంది. ఎవరికీ తెలియకుండా ఏకంగా ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను. కానీ తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని, అందరిలో టీబీ గురించి అవగాహన పెంచాలని భావించాను” అని తెలిపారు. చిన్నప్పటి నుంచే ఈ వ్యాధిని ఎదుర్కొంటూ వచ్చిన సుహాసిని, 36 ఏళ్ల వయసులో మళ్లీ టీబీ మళ్లీ తిరగబడిందని, ఈ కారణంగా తన ఆరోగ్యం దెబ్బతిన్న విషయాన్ని వెల్లడించారు.
టీబీ ప్రభావంతో ఒక్కసారిగా బరువు తగ్గిపోవడంతో పాటు వినికిడి సమస్య కూడా ఎదురైందని సుహాసిని తెలిపారు. అయితే, వైద్యుల సూచనలను పాటించి, నిరంతర చికిత్స తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందని వెల్లడించారు.
ఈ విషయాన్ని బయటపెట్టడం ద్వారా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. తాను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్ చేయడం ద్వారా మరెందరికో స్పూర్తినిచ్చిన సుహాసిని, నిజంగా ధైర్యసాహసాలకు నిదర్శనం అని చెప్పాలి!

One thought on “షాకింగ్ నిజం బయటపెట్టిన సుహాసిని – టీబీతో గడిపిన రోజులు!”
Comments are closed.