ఫన్నీ వీడియోతో వరుణ్ తేజ్ సర్‌ప్రైజ్ – కొత్త సినిమా హైప్!

Varun Tej new movie promo

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ విభిన్న ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే, హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనదైన స్టైల్‌లో ప్రయాణం కొనసాగిస్తున్న వరుణ్, తాజాగా దర్శకుడు మేర్లపాక గాంధీతో ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ ఓ ఫన్నీ ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలో వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మధ్య నడిచిన ఫన్నీ సంభాషణ ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది. చీకట్లో నిలబడి ఉన్న వరుణ్ వద్దకు వెళ్లిన సత్య, “వెలుగు, చీకటి కామన్, బయటకి వచ్చేయ్ బ్రో!” అని అంటాడు.

దానికి వరుణ్, “అంత సీన్ లేదు, సమ్మర్ కదా, కరెంట్ పోయింది” అని సమాధానమిస్తాడు. అయితే వెంటనే కరెంట్ వచ్చేయడంతో సత్య, “చూశావా బ్రో! నేను రాగానే నీ లైఫ్‌లో వెలుగు వచ్చేసింది!” అంటూ మరింత హాస్యాన్ని పండిస్తాడు.

ప్రోమోలో సినిమాపై మరిన్ని హింట్స్ ఇచ్చారు. కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ కామెడీగా ఈ మూవీ రూపొందుతుందని, ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనట్టు యూనిట్ వెల్లడించింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ కొత్త సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

Read More

One thought on “ఫన్నీ వీడియోతో వరుణ్ తేజ్ సర్‌ప్రైజ్ – కొత్త సినిమా హైప్!

Comments are closed.