విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి లోకేశ్ స్పందిస్తూ, “పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటన రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అయితే వివిధ సంఘాలు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.
Read More : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు – టూరిజం అభివృద్ధిపై దృష్టి

One thought on “పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణంపై మంత్రి లోకేశ్ స్పందన”
Comments are closed.