కెరీర్‌లో కష్టాలు.. లవ్ లైఫ్‌లో జోరు – మళ్ళీ వార్తల్లో అమీర్ ఖాన్!

Aamir Khan dating Gauri Sayeed

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన అమీర్ ఖాన్ ప్రస్తుతం కెరీర్ పరంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు విభిన్నమైన కథలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ‘దంగల్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ₹2000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సూపర్‌స్టార్‌గా నిలిచారు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ వంటి సినిమాలు తీవ్రంగా విఫలమవడంతో, అభిమానులను నిరాశకు గురి చేశాయి. ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలై రెండేళ్లు కావస్తుండగా, తాజాగా అమీర్ ఖాన్ ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ఆయన గత హిట్ ‘తారే జమీన్ పర్’కి సీక్వెల్‌గా రూపొందనుండగా, జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. 2018లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ ‘ఛాంపియన్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సినిమాల్లో విశ్రాంతి తీసుకున్నప్పటికీ, తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో అమీర్ ఖాన్ తూచుతూచి అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండు వివాహాలు, విడాకులు ఎదుర్కొన్న ఆయన, ఇటీవల తన 60వ పుట్టిన రోజు సందర్భంగా గౌరీ స్ప్రత్ అనే హిందూ మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గత 25 ఏళ్లుగా ఆమెతో స్నేహం కొనసాగుతోందని, ఇప్పుడు సంబంధం ప్రేమగా మారిందని చెప్పారు. అయితే, వరుసగా హిందూ మహిళలే ఎందుకు అమీర్ జీవితంలోకి వస్తున్నారన్నది నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రేమ కథలు తమకు అర్థం కావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న అభిప్రాయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

Read More

One thought on “కెరీర్‌లో కష్టాలు.. లవ్ లైఫ్‌లో జోరు – మళ్ళీ వార్తల్లో అమీర్ ఖాన్!

Comments are closed.