సీఎం రేవంత్ రెడ్డితో మోహన్ బాబు, విష్ణు భేటీ – చర్చలో కీలక అంశాలు

cinema

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకోవడం గమనార్హం.

సీఎంతో భేటీ అనంతరం మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రేవంత్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయనతో పలు అంశాలపై చర్చించడం అద్భుత అనుభవంగా అనిపించిందని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ చూపిస్తున్న మద్దతు, నిబద్ధతను ప్రశంసించినట్లు మంచు విష్ణు తెలిపారు.

ఇక ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గద్దర్ తెలంగాణ చలన చిత్ర పురస్కారాల విధివిధానాలను సీఎం ఆమోదించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read More