తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వార్తా ఛానల్ మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, “ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అత్యంత ప్రాధాన్యమైనది. ఇటువంటి భౌతిక దాడులకు స్థానమే లేదు. బెదిరింపుల ద్వారా మీడియా స్వతంత్రతను కట్టడి చేయాలనుకోవడం ప్రమాదకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహా న్యూస్ యాజమాన్యం, జర్నలిస్టులకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
Read More : వల్లభనేని వంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం

2 thoughts on “మహా న్యూస్ ఘటనను ఖండించిన సీఎం”
Comments are closed.